శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (20:00 IST)

భాగ్యనగరికి రానున్న హోం మంత్రి అమిత్ షా - రెండు రోజుల బస

amith shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ పర్యటనలో ఆయన రెండు రోజుల పాటు నగరంలో బస చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబరు 17వ తేదీన జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేడుకకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరవుతున్నారు. ఈ వేడుకలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరుకానున్నారు. 
 
16వ తేదీన భాగ్యనగరికి చేరుకునే ఆయన ఆ రాత్రికి నగరంలో బస చేస్తారు. 17వ తేదీన విమోచన దినోత్సవం వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత నగర బీజేపీ శాఖకు చెందిన పలువురు ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతపై దృష్టిసారించిన అమిత్ షా.. నగర శాఖ ప్రతినిధులతోనూ ఇదే విషయంపై కీలక సలహాలు, సూచనలు ఇస్తారు.