సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (16:44 IST)

తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలి : లక్ష్మీపార్వతి

lakshmi parvathi
తెలుగుదేశం పార్టీని హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడెమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన విషయం తెల్సిందే. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగై మారింది. 
 
దీనిపై లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, ఇకనైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరారు. దివంగత మహానటుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీని హస్తగతం చేసుకున్నారని మండిపడ్డారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
ఇకపోతే, గత చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 వేల పాఠశాలలు మూతపడ్డాయని ఆమె ఆరోపించారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. పేద పిల్లలకు ఆంగ్ల భాషను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఒక్క సీఎం జగన్‌కే దక్కుతుందని చెప్పారు. అదేసమయంలో జగన్ తెలుగు భాషకు ద్రోహం చేస్తున్నారని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు.