1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Rains and Temperature raised in Telangana various Places

తెలంగాణాలో భానుడి భగభగలు... మరోవైపు కుండపోత వర్షం

telangana
తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు భానుడు భగభగలు. మరోవైపు, మరికొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా కేతేపల్లిలో అత్యధితంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, జగిత్యాల జిల్లా కోల్వాయిలో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
తెలంగాణా రాష్ట్రంలో నెలకొన్న విచిత్ర వాతావరణంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లిలో శనివారం అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత, నల్గొండలో 38 డిగ్రీలు, భద్రాచలంలో 26 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నెలకొంది. జూలై నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఇంకోవైపు, జగిత్యాల జిల్లాలోని కోల్వాయిలో అత్యల్పంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమరంభీం జిల్లా కెరిమెరిలో అత్యల్పంగా 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో గాలులలతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావం కారణంగా నేడు ఓ మోస్తారు వర్షాలు ఆది, సోమవారాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
డిసెంబరు 25 నుంచి దేశంలో 5జీ సేవలు?