గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (09:53 IST)

రంగారెడ్డి ప్యాకేజీ-1 పనుల్లో విషాదం ... క్రేన్ వైరు తెగిన ఐదుగురు కూలీల దుర్మణం

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. రంగారెడ్డి ప్యాకేజీ-1 ఇర్రిగేషన్ పనుల్లో ఈ ఘటన జరిగింది. కొందరు కూలీలు పంప్ హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. మృతులంతా బీహార్ రాష్ట్ర కూలీలుగా గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రంగారెడ్డి ప్యాకేజీ-1 పనులు చేసేందుకు కూలీలు ఉపక్రమించారు. ఇందుకోసం కొందరు కూలీలు పంప్‌హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైరు ఒక్కసారిగా తెగిపడిపోయింది. దీంతో కూలీలు కిందపడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో కూలీ తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.