టైటానిక్ నటుడు డేవిడ్ వార్నర్ ఇకలేరు...
హాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు హాలీవుడ్ వార్నర్ మృతి చెందారు. ఈయన వయసు 80. గత కొంతకాలంగా కేన్సర్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.
ఈయన 'టైటానిక్' చిత్రంలో బిల్లీ జేన్ సైడ్‌కిక్ స్పైసర్ లవ్‌జాయ్‌గా నటించారు. అలాగే, 'ది ఒమెన్', 'ట్రాన్' వంటి చిత్రాలలో నటించారు. డేవిడ్ వార్నర్ 1962లో మొదటిసారిగా సినిమాల్లోకి అడుగుపెట్టి గత 60 యేళ్లుగా హాలీవుడ్ చిత్రాల్లో నటించారు.