గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జులై 2022 (12:10 IST)

సీనియర్ కార్టూనిస్ట్ పాప ఇకలేరు

ప్రముఖ సీనియర్ కార్టూనిస్ట్ పాప ఇకలేరు. ఆయన పూర్తిపేరు కొయ్య శివరామరెడ్డి. వయసు 77 సంవత్సరాలు. ఈయన శనివారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు చేసిన ఓ ఆపరేషన్ విఫలం కావడంతో మృతి చెందారు. 
 
పాప పేరుతో శివరామిరెడ్డి వేసిన కార్టూన్లు చాలా ప్రాచూర్యం పొందాయి. దీంతో ఆయన పేరు పాపగా స్థిరపడిపోయింది. 1970లో ప్రముఖ దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా పాప పని చేశారు. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య.. యాదగిరి అనే పేరుతో ఉన్న హెలికాఫ్టర్లలో పర్యటించేవారు. 
 
దీనిని ఆధారంగా చేసుకుని పాప ఎన్నో వ్యంగ్య కార్టూన్లు వేశారు. వీటితో తెలుగులో రాజకీయ కార్టూన్లు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఈయన 1944 ఆగస్టు 14వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. ఈయన పలు పత్రికల్లో పనిచేశారు.