గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (11:19 IST)

ట్రిబుల్ ఐటీలో మళ్ళీ ఆందోళనకు దిగిన విద్యార్థులు

basara iiit students
తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో ట్రిబుల్ ఐటీ విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా మరోమారు ఆందోళనకు దిగారు. డిమాండ్ల సాధన కోసం మరోమారు పోరుబాట పట్టారు. విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన అధికారులు అప్పటికపుడు మెస్‌‍ టెండర్లకు కొత్త నోటిఫికేషన్ జారీచేశారు. 
 
అంతేకాకుండా ఆ వివరాలను ఆర్జీకేయూటీ వెబ్‌సైట్‌లో కూడా పెట్టారు. మెస్ టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీచేస్తే సరిపోదని, అలాగే, తమ డిమాండ్ల సాధనపై కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి నోటిఫికేషన్స్‌ను గతంలో చాలా ఇచ్చారు.. చాలా చూశామ్ అంటూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. 
 
ఈ నెల 24వ తేదీలోపు మెస్ టెండర్లను పూర్తి చేస్తామని మాటిచ్చి ఇపుడు మాట తప్పారంటూ వారు మండిపడుతున్నారు. ఈ సారి మాత్రం కొత్త టెండర్లు ఖరారయ్యేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.