శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (14:05 IST)

సరదా కోసం బీచ్‌కు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థులు.. ఏడుగురు గల్లంతు

Beach
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఒక విద్యార్థి మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. 
 
అమావాస్య కావడం, చీకటి పడటం రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా మారాయి. ఇప్పటికీ గల్లంతైన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదన్నారు పోలీసులు. అటు రెస్క్యూ కోసం నేవీ, కోస్ట్ గార్డ్స్ సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆగిపోయింది. శనివారం ఉదయం నుంచి మళ్లీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. 
 
అలల ఉధృతి కారణంగా నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నర్సీపట్నానికి చెందిన పవన్ మృతి చెందగా.. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
 
గోపాలపట్నానికి చెందిన జగదీశ్, నర్సీపట్నానికి చెందిన జశ్వంత్, గుంటూరుకి చెందిన సతీశ్, గణేశ్, యలమంచిలికి చెందిన చందు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం తీరం వద్ద పోలీసులు, మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.