గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (10:06 IST)

వరదలు.. తూర్పు గోదావరి జిల్లాలో కొట్టుకుపోయిన 15 ఏళ్ల వనదుర్గ ఆలయం

Temple
Temple
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఓ ఆలయం వరదల్లో కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోదావరి ఎడమగట్టున 15 ఏళ్ల క్రితం స్థానికులు వనదుర్గ ఆలయాన్ని నిర్మించి అమ్మవారికి పూజలు చేశారు. 
 
అలాగే శ్రావణ శుక్రవారం అయిన నిన్న అమ్మవారిని మహిళలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అయితే వరదల ధాటికి శుక్రవారం మధ్యాహ్నం ఆలయం పక్కకు ఒరగడంతో భయాందోళనలకు గురైన భక్తులు ఒక్కసారిగా ఆలయం నుంచి బయటకు వచ్చారు. 
 
సాయంత్రానికల్లా ఆలయం నీటిలో ఒరిగిపోయింది. మెల్లగా వరదలో కొట్టుకుపోయింది. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద భారీ ఇసుక తవ్వకాల వల్లే ఈ విధంగా ఆలయం వరదల్లో కొట్టుకుపోయిందని గ్రామస్థులు వాపోయారు.