సంబంధిత వార్తలు
- ఉద్రిక్తంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ : కమిషనర్ ఆనంద్ తనిఖీలు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఆరోపణలు చేయొద్దు : కోర్టు ఆదేశం
- పెద్ద హీరోలతో రొమాన్స్ చేసినప్పుడు ఇబ్బందిపడ్డాను.. అమలాపాల్
- ఒడిశాలో షాకింగ్ ఘటన.. పురీష నాళంలో గాజు గ్లాసు.. పది రోజుల తర్వాత?
- రాజా సింగ్ అరెస్ట్.. నాంపల్లి కోర్టు వెలుపల హైటెన్షన్..
హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజులు వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా బుధవారం రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాం కురిసింది. ముఖ్యంగా, ఖైరతాబాద్‌లో అత్యధికంగా 1.0 సెంటీమీటర్లు, హిమయత్ నగర్‌లో 1.2 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 1.0 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
అలాగే, వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.