1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Revanth Reddy meet his cadre in kodangal house

తెలంగాణ నలుగురి చేతిలో ఉంది.. 4 కోట్ల మంది ఏకం కావాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం నలుగురు సభ్యులు కలిగిన ఓ కుటుంబం చేతిలో ఉందని, వారి నుంచి విముక్తి కల్పించేందుకు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏకం కావాల్సి ఉందని టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy
తెలంగాణ రాష్ట్రం నలుగురు సభ్యులు కలిగిన ఓ కుటుంబం చేతిలో ఉందని, వారి నుంచి విముక్తి కల్పించేందుకు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏకం కావాల్సి ఉందని టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు. 
 
టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఆదివారం ఉదయం నుంచి కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనకు కార్యకర్తలు మాత్రమే తన అదిష్టానమని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు. 
 
"తెలంగాణ సమాజం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి వ్యతిరేకంగా, ఆ కుటుంబంలోని నలుగురి దోపిడీకి వ్యతిరేకంగా నాలుగు కోట్ల మంది ప్రజలు పునరేకీకరణ కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ సమాజం వివిధ మొక్కలుగా విడిపోతే, కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది. ఈ కేసీఆర్‌కు వ్యతిరేకంగా మన సమాజం పునరేకీకరణ జరగాలన్నారు.
 
అందువల్లే ఈ రోజు ఇంత బాధ అయినా, ఇంత ఇబ్బంది అయినా నిర్ణయం తీసుకున్నాను. నేను మొన్న వచ్చినప్పుడే చెప్పినా. నా అధిష్టానం ఎక్కడో లేదు. నా అధిష్టానం కొడంగల్ కార్యకర్తలే. మీరు ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తా. మిమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోనని చెప్పినా" అని అన్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నాడు ఎన్టీఆర్‌కు నాదెండ్ల.. నేడు చంద్రబాబుకు రేవంత్ : ఎల్. రమణ