సంబంధిత వార్తలు
- చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం : బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద...
- పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది దుర్మరణం.. 32మందికి గాయాలు
- నెల్లూరు దామరమడుగు వద్ద ఘోర ప్రమాదం : 8 మంది దుర్మరణం
- గ్వాలియర్లో ఘోర రోడ్డు ప్రమాదం... నెల్లూరులో ఆటోను ఢీకొన్న పాల వ్యాను
- తెలుగు రాష్ట్రాల్లో దూసుకొచ్చిన మృత్యువు .. చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్తూ...
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం : పెళ్లింట విషాదం... 15మందికి గాయాలు
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఒకటి అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
జువ్వాడి నుంచి కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగే వివాహానికి కొందరు ట్రాక్టర్‌లో పెళ్లి సామగ్రితో తీసుకెళ్తున్నారు. కృష్ణాజివాడి వద్దకు రాగానే ట్రాక్టర్‌ను వెనుక నుంచి అమిత వేగంగా వచ్చిన లారీ ఒకటి ట్రాక్టర్ ఢీకొట్టంది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టరులో 16 మంది ఉన్నారు. వీరంతా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. దవాఖానాలో చికిత్స పొందుతూ కాశవ్వ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
