1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Sania in cow shooting case: MLA Raja Singh sensational allegations

ఆవును కాల్చి చంపిన కేసులో సానియా: ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు

Sania
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్‌ జిల్లా దామగుండలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఉందంటూ రాజా సింగ్ ఆరోపించారు. 
 
ఫామ్‌హౌస్‌లో సానియా మీర్జానే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెప్తున్నట్లు రాజా సింగ్ పేర్కొన్నారు. సానియా గతంలో కూడా నెమలిని చంపినట్లు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. 
 
గోమాతపై కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.వికారాబాద్ అడ‌వుల్లో ఇటీవ‌ల జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో సానియా మీర్జా ఫామ్‌హౌస్ ఇంచార్జి ఉమర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
 
నాలుగు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో మేత‌కు వచ్చిన ఆవును కాల్చి చంపిన‌ట్లు ఉమ‌ర్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ విష‌య‌మై స్థానికుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు.
 
నిందితుడికి తుపాకీ ఎలా వ‌చ్చింద‌నే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కేసు విచారణ జరుగుతుండగానే రాజాసింగ్ సానియా మీర్జాపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
About Writer
ఎం
తర్వాతి కథనం
కేసీఆర్ ఫాంహౌస్‌లో ఓట్లు లెక్కిస్తారేమో: విజయశాంతి