1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. School Headmaster Arrested For Molesting 5 Students In Telangana

హెడ్మాస్టర్ చీకటి బాగోతం... ప్రత్యేక క్లాస్‌ల పేరుతో పసిమొగ్గలపై లైంగికదాడి

Telangana
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాలో ఓ హెడ్మాస్టర్ చీకటి బాగోతం బట్టబయలైంది. ప్రత్యేక తరగతుల పేరుతో పసిమొగ్గలపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం బట్టబయలుకావడంతో గ్రామస్తులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని చింతవర్రెలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఐదుగురు బాలికలున్నారు. 
 
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొడ్డే సునీల్‌ కుమార్‌ వీరిపై కొద్దిరోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరిౖకైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు. దీంతో భయపడిన చిన్నారులు నోరుమెదపలేదు.
 
ఈ క్రమంలోనే లైంగికదాడి కారణంగా ఓ విద్యార్థిని ఆస్పత్రి పాలైంది. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియగా.. మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులతో కలసి ఆ హెచ్‌ఎంను నిలదీశారు. గత రెండ్రోజులుగా ఈ విషయంపై మరో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించాడు. 
 
అది కాస్త బయటకు పొక్కడంతో గ్రామస్తులందరూ ఉపాధ్యాయుడిని మంగళవారం నిలదీసి దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. హెడ్మాస్టర్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదట...!! (video)