శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెెెెఎస్కె
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (11:06 IST)

షర్మిల కొత్త పార్టీ జెండా! డిటో వైఎస్సార్సీపీ!!

వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌య ష‌ర్మిల కొత్త పార్టీ జెండా మోడ‌ల్ వ‌చ్చేసింది. వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ జెండా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌లో అన్న‌య్య జ‌గ‌న్ పార్టీ వైఎస్సార్ సీపి జెండాని దాదాపు పోలిన‌ట్లు వైఎస్సార్ టిపి జెండా త‌యార‌వుతోంది.

గ‌తంలో వెబ్ దునియా వివ‌రించిన‌ట్లే, ష‌ర్మిల పార్టీ జెండా 70 శాతం పాలపిట్ట రంగు.... 30 శాతం నీలం రంగు క‌లిగి ఉంది. పాలపిట్ట రంగు మధ్యలో తెలంగాణ మ్యాప్ చిత్రించారు. ఆ తెలంగాణ చిత్రపటంలో వైఎస్సార్ బొమ్మ పెట్టారు. త‌న తండ్రి మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ష‌ర్మిల త‌న కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు.

ఇప్ప‌టికే త‌న పార్టీకి సల‌హాదారులు, సూత్ర‌ధారులు, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించుకున్న ష‌ర్మిల హైద‌రాబాదు లోట‌స్ పాండ్ లో సీఎం జ‌గ‌న్ ఇంటినే పార్టీ కార్యాల‌యంగా చేసుకున్నారు. అక్క‌డి నుంచి పార్టీ కార్య‌క‌లాపాల‌ను ఎప్పుడో ప్రారంభించేశారు. ఇక పార్టీని లాంఛ‌నంగా ప్ర‌జ‌ల ముందుకు తేవ‌డ‌మే త‌రువాయి.