మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (21:53 IST)

ట్రిపుల్ ఆర్‌పై వేటు వేయండి : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైకాపా లేఖ

ఏపీలోని అధికార పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైకాపా నేతలు లేఖ రాశారు. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఇదే అంశాన్ని వారు మరోసారి లేవనెత్తారు. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గత ఏడాది జులై 3న తమకు ఫిర్యాదు చేశామని... అయితే అకారణంగా ఈ విషయంలో జాప్యం చేస్తున్నారంటూ లేఖలో వారు పేర్కొన్నారు. 
 
పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈ లేఖపై ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 
 
మరోవైపు, తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించాలని స్పీకర్‌కు రఘురామరాజు ఇప్పటికే లేఖ రాశారు. తాను యువజన శ్రామిక రైతు పార్టీ తరపున గెలిచానని, ఎక్కడా కూడా పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించలేని అందులో పేర్కొన్నారు.