1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Sriram Pooja in Telangana Raj Bhavan

తెలంగాణ రాజ్‌భవన్‌లో రాములోరి పూజ

Sriram Pooja
అయోధ్యలో భూమి పూజ సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్‌ ప్రత్యేకంగా ముస్తాబైంది. రాములోరి పూజ నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

రాజ్ భవన్‌ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీరాముని చిత్ర పటానికి గవర్నర్ దంపతులు పూజలు నిర్వహించారు. మరోవైపు అయోధ్య రామాలయ భూమి పూజ అనుకున్న ముహూర్తం ప్రకారం ఘనంగా ముగిసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా సరిగ్గా ముహూర్త సమయానికే పండితులు ఈ క్రతువును చేయించారు.

ఈ క్రతువు ముగియగానే ప్రధాని మోదీ పునాది నుంచి కుంకుమ తీసుకొని నుదుట ధరించారు. దీంతో అక్కడే వున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో పాటు అతిథులు గట్టిగా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత ప్రధాని మోదీ పునాది వేసిన ప్రాంతానికి శిరస్సు వంచి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో పాటు సీఎం యోగి, గవర్నర్ ఆనందీబేన్ పాటిల్, ట్రస్ట్ అధ్యక్షులు నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
బంగారం ధర ₹55,000- రెండు రోజుల్లోనే వెండి ధర రూ.8వేలకు..!!