1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Sudhakar Reddy murder case : Wife Swathi practice yoga in jail

భర్తను చంపిన స్వాతి జైల్లో యోగా చేస్తోందట...

ప్రియుడు శారీరక సుఖానికి అలవాటుపడి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చిన భార్య స్వాతి ఇపుడు జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఈమె ప్రస్తుతం జైలు జీవితం గడుపుతూ ఎలాంటి ఆందోళన లేకుండా యోగా చేస్తోందట.

Sudhakar Reddy murder case
ప్రియుడు ఇచ్చే శారీరక సుఖానికి అలవాటుపడి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చిన భార్య స్వాతి ఇపుడు జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఈమె ప్రస్తుతం జైలు జీవితం గడుపుతూ ఎలాంటి ఆందోళన లేకుండా యోగా చేస్తోందట. ఆమెను చూసిన జైలు సిబ్బందే ఆశ్చర్యపోతున్నారట. 
 
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన తన భర్త అయిన కాంట్రాక్టర్ సుధాకర్‌ రెడ్డిని భార్య స్వాతి తన ప్రియుడు రాజేష్‌తో కలిసి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న స్వాతిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు 687 అనే ఖైదీ నంబరును కేటాయించారు. 
 
ఈమె ఉంటున్న లాకప్‌లో మొత్తం 13 మంది ఖైదీలు ఉన్నారు. వీరితో పాటు జైలులో ఎంలాంటి ఆందోళన లేకుండా స్వాతి గడిపినట్లు సమాచారం. పైగా, స్వాతికి యోగా చేసే అలవాటు ఉండటంతో కొంత సమయం పాటు ఆమె యోగా కూడా చేసిందట. స్వాతి చదువుకున్నందున జైలులో ఉండే నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించమని పోలీసులు చెప్పినట్లు సమాచారం. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు