శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2017 (21:16 IST)

జగన్ పాదయాత్రలో సూరి భార్య భానుమతి... అవకాశం ఇస్తే...

చాలా రోజుల తరువాత మద్దెలచెరువు సూరి భార్య భానుమతి ప్రత్యక్షమయ్యారు. అది కూడా వైఎస్ఆర్ సిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలోనే. జగన్ మోహన్ రెడ్డిని కలవడమే కాకుండా ఆ తరువాత భానుమతి మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే నాకు గౌరవం. ఆయన పాదయాత

చాలా రోజుల తరువాత మద్దెలచెరువు సూరి భార్య భానుమతి ప్రత్యక్షమయ్యారు. అది కూడా వైఎస్ఆర్ సిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలోనే. జగన్ మోహన్ రెడ్డిని కలవడమే కాకుండా ఆ తరువాత భానుమతి మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే నాకు గౌరవం. ఆయన పాదయాత్ర చేయడం నేను టీవీల్లో చూశాను. రాప్తాడు నియోజవకర్గంలో తను పర్యటించేటప్పుడు వచ్చి కలవమని జగన్ చెప్పారు. అందుకే వచ్చి కలిశాను.
 
నేను ఇంకా వైసిపిలోనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అవకాశమిచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పదవులంటే పెద్దగా ఆసక్తి లేదు. కొంతమంది ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబునాయుడును ఉద్దేశించి భానుమతి వ్యాఖ్యలు చేశారు. భానుమతి ఒక్కసారిగా జగన్ పాదయాత్రలో ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.