1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Suryapet : Lover committed Suicide after in Huzurnagar

ప్రియురాలు చనిపోయిందనీ ప్రియుడు కూడా..

Suryapet
తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ విషాద ఘటన జరిగింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రియుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీరిద్దరు రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులిద్దరు ప్రాణాలొదలడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డకు చెందిన పవన్, మౌనిక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే మౌనిక.. గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. 
 
దీంతో ప్రియురాలి మరణం తట్టుకోలేక పవన్ కూడా శుక్రవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరవలవుతున్నది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే ... అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని అమ్ముకునే అవకాశం