1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Teacher leaks tenth class telugu paper in telangana

తాండూరులో టెన్త్ ప్రశ్నా పరీక్షా పత్రం.. వాట్సాప్ ప్రత్యక్షం

exams
తెలంగాణలో వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్నం లీకైంది. టీచర్ బందెప్ప ఫోన్ వాట్సాప్ నుంచి తెలుగు పేపర్ లీకైనట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రం స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
పేపర్ లీక్ పై మండల విద్యాధికారి వెంకయ్య పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు టీచర్ బందెప్పను అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, టెన్త్ పేపర్ లీక్ ఘటనపై విచారణ వేగవంతం అయింది. పోలీస్ విభాగం, విద్యాశాఖ ఉమ్మడిగా విచారణ చేపట్టాయి. ఇప్పటికే ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. టెన్త్ పరీక్షల్లో ఇన్విజిలేటర్ గా వ్యవహరిస్తున్న టీచర్ బందెప్పకు గతంలో నేర చరిత్ర ఉన్నట్టు వెల్లడైంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
విశాఖపట్నంలో తమ రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించిన అల్టిగ్రీన్‌