గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (21:12 IST)

ఫ్లోరిడా- కిరాతకుడిగా మారిన విద్యార్థి.. టీచర్‌ను ఎముకలు విరిగేలా..?

Florida
Florida
ఫ్లోరిడాలో చదువులు చెప్పే టీచర్ పట్ల ఓ విద్యార్థి కిరాతకుడిగా మారాడు. తన వీడియో గేమ్  తీసేసుకుందనే ఆగ్రహంతో అసిస్టెంట్ టీచర్‌పై రెచ్చిపోయి దాడికి పాల్పడ్డాడు. ఫ్లోరిడాలోని మటాంజస్ హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
స్కూల్ టైమ్‌లో గేమ్ ఆడుతుండటంతో అసిస్టెంట్ టీచర్ దాన్ని తీసుకుందని.. దీంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన 17 ఏళ్ల విద్యార్థి.. టీచర్‌పై దాడి చేశాడు. ఎముకలు విరిగేలా ఆ విద్యార్థి టీచర్‌పై దాడి చేశాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. 
 
ఈ ఘటనలో అసిస్టెంట్ టీచర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్రగాయాలతో ఆమెకు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.