సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (19:17 IST)

ప్రీతి కేసు-సీనియర్ పీజీ విద్యార్థి డా.సైఫ్‌ అరెస్ట్

doctor
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల అనస్థీషియా విభాగం విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ పీజీ విద్యార్థి డా.సైఫ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
డా.ప్రీతిని వేధించాడన్న ఆరోపణలు సైఫ్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా... ముట్టెవాడ పోలీసులు సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. 
 
ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ప్రీతిని సైఫ్ వేధించినట్టు అతడి మొబైల్‌లో కొన్ని ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది.
 
విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టనున్నారన్న సమాచారంతో కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.