1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated: శనివారం, 25 ఫిబ్రవరి 2023 (18:51 IST)

గుండెను శరీరం నుంచి వేరు చేశాడు.. ప్రేమ కోసం కిరాతకుడిగా మారాడు..

crime scene
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ఆమె కోసం ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటీపడ్డారు. చివరికి తన ప్రియురాలు ఎక్కడ తన స్నేహితుడికి దక్కుతుందోననే అనుమానంతో మరో యువకుడిని హత్య చేశాడు. 
 
అంతటితో ఆగకుండా మృతుడి గుండెను బయటకు తీసి ప్రియురాలికి వాట్సప్ ద్వారా ఫొటో పంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా చారుకొండ మండ‌లం సిర‌స‌న‌గండ్ల‌కు చెందిన నేనావ‌త్ న‌వీన్(20) న‌ల్ల‌గొండ జిల్లా మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైన‌లియ‌ర్ చ‌దువుతున్నాడు. అదే కాలేజీలో హరికృష్ణ చదువుతున్నాడు. 
 
అదే కాలేజీలో చదువుతున్న అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో ఇద్ద‌రి మ‌ధ్య బేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఓ పార్టీలోనూ వీరికి మధ్య వివాదం జరిగింది. స్నేహితులైన వీరిద్దరూ ఒకే అమ్మాయి కోసం పోటీ పడ్డారు. 
 
దీంతో ఆగ్రహావేశంతో హరి న‌వీన్‌ను విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టి చంపాడు. శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేశాడు. గుండె కదా ప్రేమించిందంటూ.. గుండెను శరీరం నుంచి వేరు చేశాడు. ఆపై ప్రియురాలికి వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపాడు. 
 
ఇలా కిరాతకుడిగా మారి ప్రియురాలి కోసం స్నేహితుడిని హతమార్చిన న‌వీన్.. పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.