1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 25 ఫిబ్రవరి 2023 (14:23 IST)

డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తాం.. ప్రతీకారం తీర్చుకుంటాం.. ఇరాన్

donald trump
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామంటూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.2020లో బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని అమెరికా బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇరాన్ టాప్ కమాండర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అందుకోసమే అత్యంత ప్రమాదకరమైన క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేయడం జరిగిందని ఇరాన్ తెలిపారు.
 
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ క్షిపణి ఆయుధాగారంలో 1,650 కి.మీ పరిధిగల అత్యంత ప్రమాదకరమైన క్రూయిజ్ క్షిపణిని చేర్చినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వైమానిక దళ చీఫ్ అమిరాలి హజిజాదే వెల్లడించారు.