బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:57 IST)

చిరంజీవి, సురేఖల వివాహ వార్షికోత్సవం

Chiranjeevi, Surekha
Chiranjeevi, Surekha
మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖల వివాహ వార్షికోత్సవం నేడే. ఈ సందర్భంగా సినిరంగంలోని ప్రముఖులు వారికి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 20, 1980లో అల్లురామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు చిరంజీవి. వారికి సుష్మిత, శ్రీజ, రామ్‌చరణ్‌ పిల్లలు. ఇన్నేళ్ళ తర్వాత అందరూ తమకు శుభాకాంక్షలు చెబుతుండడం ఏదో తెలీని అనుభూతిని కలిగిస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. సాంప్రాదాయంగా ఈరోజు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్ళి అక్కడ రక్తదానం చేస్తున్నవారిని అభినందించారు. అదేవిధంగా అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ రవణం స్వామినాయుడుతోపాటు పలువురి నుంచి శుభాకాంక్షల వెల్లువ వస్తోంది.
 
ఈ ఏడు చాలా ప్రత్యేకమైన రోజుగా చిరంజీవి ఇటీవలే వెల్లడించారు. రామ్‌చరణ్‌ ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలోని పాటకు ఆస్కార్‌ నామినేషన్‌ అవడం చాలా ఆనందంగా వుందని తెలిపారు. అదేవిధంగా రవితేజతో నటించిన వాల్తేరు వీరయ్య సక్సెస్‌ కావడం పట్ల చాలా ఆనందంగా వున్నారు. కాగా, ఆదివారంనాడు మరణించిన నందమూరి తారకరత్న మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.