1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana : attempt to assault woman

నీటి కోసం బావి దగ్గరకు వెళ్ళిన వివాహితపై బలాత్కారం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కాటారం మండలంలో ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. తాగునీటి కోసం బావి దగ్గరకు వెళ్లిన వివాహితపై అదే గ్రామానికి ఓ వ్యక్తి బలాత్కారం చేయబోయాడు.

Telangana
తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కాటారం మండలంలో ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. తాగునీటి కోసం బావి దగ్గరకు వెళ్లిన వివాహితపై అదే గ్రామానికి ఓ వ్యక్తి బలాత్కారం చేయబోయాడు. దీంతో ఆ మహిళ భయపడి కేకలు వేస్తూ ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకుని భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కాటారం నేతకానివాడకు చెందిన ఓ వివాహిత తాగునీటి కోసం జాడి బానయ్య అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న బావి వద్దకు వెళ్లింది. ఆ సమయంలో అతని ఇంట్లోనే కాకుండా బావి వద్ద కూడా ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన బానయ్య.. ఆమె కొంగుపట్టుని ఇంట్లోకి లాక్కెళ్ళి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆమె అతని నుంచి తప్పించుకుని కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడకు రాగానే ఆ అతను పారిపోయాడు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన భర్తతో సదరు బాధిత వివాహిత చెప్పి, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న బానయ్య కోసం గాలిస్తున్నారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
జ్యూస్‌లో మత్తు కలిపి అత్యాచారం.. ఆపై వీడియో చూపుతూ...