సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (11:53 IST)

ఒంటరిగా వున్న మహిళలపై గ్యాంగ్ రేప్‌.. కాళ్లు కదపకుండా బండరాయిని?

ఐటీ రాజధాని బెంగళూరులో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇళ్లల్లో ఉన్న మహిళలను గుర్తించిన కామాంధులు వారిపై సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టిన ఘటన ఈ నెల 16న బెంగళూరు నగర శివారులోని నెలమంగళకు సమీపంలో

ఐటీ రాజధాని బెంగళూరులో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇళ్లల్లో ఉన్న మహిళలను గుర్తించిన కామాంధులు వారిపై సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టిన ఘటన ఈ నెల 16న బెంగళూరు నగర శివారులోని నెలమంగళకు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాదనాయకహళ్లికి చెందిన కార్మికురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
కార్మికురాలి భర్త ఇంట్లో లేడనే విషయాన్ని గమనించిన రాజగోపాల్ నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రాఘవేంద్ర అలియాస్ కుమార్ (32), లగ్గెరెకు చెందిన పునీత్ (22), లక్ష్మీపురానికి చెందిన వెంకటేశ్‌తోపాటు మరో ఇద్దరు కలిసి కార్మికురాలి ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ అత్యాచారం కార్మికురాలి భర్త కంట ముందే జరిగిందని పోలీసులు చెప్తున్నారు.
 
ఇదే విధంగా శుక్రవారం రాత్రి నేపాల్‌కు చెందిన యువతిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా వున్న ఆమెను కామాంధులు పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆపై ఆమె కాళ్లు కదపకుండా వుండేందుకు పెద్ద బండరాయిని ఉంచి పారిపోయారు. అయితే బాధితురాలు కేకలు విని స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.