బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (09:36 IST)

ప్రపంచంలోనే ఫస్ట్ టైం : రెండో కాన్పులో ఇద్దరు.. మూడోసారి ముగ్గురు

సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ప్రపంచంలోనే తొలిసారి రెండో కాన్పులో ఇద్దరు, మూడో కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఈ అరుదైన ప్రసవం అమెరికాలో చోటుచే

సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ప్రపంచంలోనే తొలిసారి రెండో కాన్పులో ఇద్దరు, మూడో కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఈ అరుదైన ప్రసవం అమెరికాలో చోటుచేసుకుంది. 
 
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన రాబర్ట్‌, నియా దంపతులకు 2011లో షాయ్‌ అనే అబ్బాయి పుట్టాడు. నాలుగేళ్ల తర్వాత 2015లో మరో ఇద్దరు కవలలు రిలే, అలెగ్జాండర్‌ జన్మించారు. అనంతరం మళ్లీ గర్భం దాల్చిన నియా స్కానింగ్‌ కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. శిశువు పెరుగుదలను తెలుసుకోవడానికి ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ చేసినప్పుడే అక్కడి టెక్నీషియన్‌ ఒకటి కంటే ఎక్కువ మంది శిశువులు ఉండొచ్చని చెప్పినట్లు నియా వెల్లడించారు. 
 
అయితే, ఇలా ఒకేసారి ముగ్గురు మాత్రం పుడతారనుకోలేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకుముందు రాబర్ట్‌ ఇంత మంది పిల్లల్ని ఎలా పెంచాలంటూ కొన్ని సార్లు జోకులు వేసేవారని, దీనికి తోడు ఒక్కసారిగా మరో ముగ్గురు పిల్లలు తోడయ్యారని ఆమె చెప్పుకొచ్పారు. పిల్లలు పుట్టినందుకు ఒకింత సంతోషంగా ఉన్నప్పటికీ వీరిందరినీ ఎలా పోషించాలా అనేది ఆ దంపతులకు పెద్ద సమస్యగా మారింది. అయితే ఇలా జరగడం ప్రపంచంలోనే ఇదే ఫస్ట్ టైం అని వైద్యులు చెపుతున్నారు.