శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (08:42 IST)

భార్యను స్నేహితులతో గ్యాంగ్‌రేప్ చేయించిన భర్త.. ఎక్కడ?

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ దారుణం జరిగింది. తన భార్యను ఓ కిరాతక భర్త తన స్నేహితులతో దగ్గరుండిమరీ సామూహిక అత్యాచారం చేయించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, లుథియానాకు చెందిన ఓ మహిళ

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ దారుణం జరిగింది. తన భార్యను ఓ కిరాతక భర్త తన స్నేహితులతో దగ్గరుండిమరీ సామూహిక అత్యాచారం చేయించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, లుథియానాకు చెందిన ఓ మహిళ మూడేళ్లక్రితం కూలీ పనిచేసే ఓ వ్యక్తిని ఆమె పెళ్లాడింది. ఇద్దరికీ అది రెండో పెళ్లి. అయితే, ఆమెతో పిల్లలుకనడం ఇష్టంలేని భర్త.. ఆమెకు ఎనిమిదిసార్లు గర్భస్రావం చేయించాడు. ఆపై ఆమెకు పిల్లలు కలగకుండా కుటుంబ నియంత్రణ చేశాడు. 
 
ఇంతలో ఆ కామాంధభర్త మరో మహిళపై మోజుపడ్డాడు. దీంతో తన భార్య నుంచి వేరుపడేందుకు విడాకులివ్వాలని లేనిపక్షంలో రేప్‌ చేయిస్తానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ బెదిరింపులకు ఆమె లొంగలేదు. దీంతో అతని చివరకు అన్నంతపనీ చేశాడు. గత జూన్‌ 6న ముగ్గురు స్నేహితులను భార్య ఉన్న గదిలోకి పంపి తాళం వేసి అత్యాచారం చేయించాడు. ఆ కామాంధులు గదిలో రేప్ చేస్తుంటే భర్త మాత్రం బయట ఉండిపోయాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆమె స్థానిక మహిళా సంఘాలను ఆశ్రయించడంతో ఎట్టకేలకు స్పందించిన పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.