శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (20:21 IST)

25న తెలంగాణ బంద్‌.. సీపీఐ(మావోయిస్టు) పిలుపు

కవి వరవరరావుతో పాటు ఇతరులను వెంటనే జైలు నుండి విడుదల చేయాలన్న డిమాండ్ తో సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ర్ట కమిటీ ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.

మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు లేఖను విడుదల చేశారు. అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్ సిబ్బంది వెనక్కి వెళ్లాల్సిందిగా పేర్కొన్నారు. 

భీమా కోరెగావ్ సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, ఇతరులను విడుదల చేయాలని, అదేవిధంగా రాజకీయ ఖైదీలందరినీ, 60 ఏళ్లు పైబడిన ఖైదీలను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.