మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (20:25 IST)

ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు: జగన్‌

ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వచ్చాయని, దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

అమూల్ సంస్థ‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన  ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌హెడ్‌ రాజన్‌ సంతకాలు చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మేనేజింగ్‌ డైరెక్టర్‌తో సీఎం మాట్లాడారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగు అన్నారు.

వైఎస్సార్‌ చేయూత, ఆసరా కింద మహిళలకు రూ.11వేల కోట్లు సాయం చేశాం. ప్రభుత్వ సహాయం మహిళల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు.