శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (13:04 IST)

తెలంగాణకు అరుదైన పక్షి!

కరోనా భయంతో గడగడలాడిపోతున్న తెలంగాణలోని కుమురం భీం జిల్లా పెంచికల్‌ పేట నందిగాం అటవీ ప్రాంతంలోని పాపురాల గుట్టవాసులను ఓ అరుదైన పక్షి కొంత సేపు పరవశుల్ని చేసింది. 
 
పొడవైన రెక్కలు, తోకతో ఆకర్షణీయంగా వున్న ఇలాంటి పక్షి ఈ ప్రాంతానికి వలస రావడం ఇదే ప్రథమమని స్థానికులు తెలిపారు. దీనిని గద్ద జాతికి చెందిన రూఫస్‌ బెల్లీడ్‌ అనే అరుదైన పక్షిగా అటవీ అధికారులు గుర్తించారు.

ఈ పక్షి చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ పక్షులు ఎక్కువగా అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్‌పేట అటవీ రేంజ్‌ అధికారి వేణుగోపాల్‌ తెలిపారు.