శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జులై 2020 (10:12 IST)

తెలంగాణలో ఐదు నెలలపాటు ఉచితంగా బియ్యం

ఇక నుంచి రాష్ట్రంలో ఆహారభద్రత, బియ్యం పంపిణీ చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జులై నుంచి నవంబర్ వరకు పంపిణీ కొనసాగుతుందని తెలిపింది.

కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు రాష్ట్రం మరో ఐదు కిలోలు అదనంగా ఇవ్వనుంది. రేషన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో కేంద్రం ఇచ్చే 5 కిలోలు,  రాష్ట్రం ఇచ్చే 5 కిలోలు కలిపి ఒక్కో లబ్దిదారునికి నెలకు 10 కిలోల చొప్పున ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.