బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (08:57 IST)

తెలంగాణ రహదారులకు పచ్చదనం కళ

తెలంగాణలోని అన్నిజాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు పచ్చదనంతో కళకళలాడేలా అవసరమైన రోడ్ల వెంటనే నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి ఆదేశాలను వెంటనే అమలు చేయాలని నర్సీరీల సంఖ్య నెలకొల్పే ప్రదేశాలను వెంటనే ఖరారు చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది. డిఎఫ్‌ఓ, హైవేస్‌, అర్‌అండ్‌బి అధికారులు ఉమ్మడిగా ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు.

జాతీయ రహదారుల వెంట 40 నర్సరీలు, రాష్ట్రహైవేస్‌లో 69, రోడ్లు భవనాలశాఖ పరిధిలో రహదారుల వెంట 141 మొత్తం 250 నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. 
 
ఒక్కోనర్సరీలో 40 వేల చొప్పున మొత్తం కోటి పెద్ద మొక్కలు పెంచేలా, వాటిని అన్నిరోడ్లకు రహదారి వనాలు(ఎవెన్యూ ప్లాంటేషన్‌) కోసం ఉపయోగించాలని నిర్ణయించారు.

ఈ నర్సరీల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులను వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. వెంటనే నర్సరీలను ప్రారంభించి వచ్చే సీజన్‌కల్లా మొక్కలు నాటేలా ప్లాన్‌ చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది.