సంబంధిత వార్తలు
- షాకింగ్... తెలంగాణకు మళ్లీ కేసీఆరే సీఎం కావాలంటున్న ఆంధ్రా ప్రజలు, బాబుకి ఇక్కడ షాకిస్తారా?
- రేవంత్ రెడ్డి చెప్పిన సెంటిమెంట్ ప్రకారం కేటీఆర్ సీఎం కాలేడా..?
- వైఎస్ లేదా కేసీఆర్.. మాకు గొడుగు పట్టాల్సిందే.. మేమే కింగ్ మేకర్లం : అక్బరుద్దీన్ ఓవైసీ
- తెలంగాణ పోల్స్ : అదిలాబాద్ జిల్లాలో పందెం కోళ్లు రెఢీ
- తెలంగాణ ఎన్నికలు : నిజామాబాద్ జిల్లాలో బరిలోని అభ్యర్థులు
ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ ఇచ్చారు..
తెలంగాణలో మధ్యంతర ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరని ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఎలా వుందనే అంశంపై చేసిన సర్వేలో.. టీఆర్ఎస్ విజయం ఖాయమని తేలిపోయిందని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారే వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
తాజా సర్వే ప్రకారం తెలంగాణలో 103 నుంచి 106 సీట్లను కైవసం చేసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. తాండూరులో నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గెలిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యమని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పర్యటన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఘాటుగా స్పందించారు.
2004లో తాము పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత తెలంగాణ ఇస్తే బాగుండేదన్నారు. కానీ 14 ఏళ్లు తెలంగాణ ఇవ్వకుండా సాచివేత ధోరణిని అవలంబించిందన్నారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కేసీఆర్ చెప్పారు.
తర్వాతి కథనం