1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana CM KCR tour in Nalgonda

నల్గొండ పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్

Telangana
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య దశదినకర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. 
 
ఈ పర్యటనలో ముందుగా పట్టణంలోని కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మారయ్య చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి హైదరాబాద్ నగరానికి తిరిగివస్తారు. 
 
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్ నల్గొండ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి నల్గొండ ఎన్జీ కాలేజీ మైదానానికి ఆయన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గాదరి కిషోర్ ఇంటికి చేరుకుంటారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రాజేశ్వరిలు దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్‌ను కూడా వారు తనిఖీ చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్