1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Power utilities preparing ground for tariff hike in Telangana

తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్ - చార్జీల పెంపునకు రంగం సిద్ధం

Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంట్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త విద్యుత్ టారిఫ్‌లను విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు ప్రతిపాదించి ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన మరుక్షణమే విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. 
 
తాజాగా చేసిన ప్రతిపాదనల మేరకు... గృహ వినియోగదారులపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య వినియోగదారులపై ఒక్క రూపాయి చొప్పున పెంచేలా ప్రతిపాదించారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించింది. 
 
తెలంగాణాలోని విద్యుత్ డిస్కంలు దాదాపు 10 వేల కోట్ల లోటుతో నడుస్తున్నాయి. ఈ నష్టంలో కొంతైనా భర్తీ చేసుకునేందుకు వీలుగా ఇపుడు విద్యుత్ చార్జీలను పెంచాలని డిస్కంలు కోరుతున్నాయి. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమైందని విద్యుత్ అధికారులు సెలవిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
గన్నవరం ఎయిర్ పోర్టులో కోల్డ్ స్టోరేజి.... కేంద్ర మంత్రికి ఎంపీ కేశినేని నాని లేఖ