గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (12:47 IST)

తగ్గిన చలి తీవ్రత - తెలంగాణాలోని ఉత్తరాది జిల్లాల్లో వర్షాలు

తెలంగాణా రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. సాధారణ ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి గాలుల ప్రభావం బాగా తగ్గాయి. పైగా, ఉత్తర భారత నుంచి తక్కువ ఎత్తులో వీచే గాలుల ప్రభావం కూడా తగ్గింది. దీనివల్లే చలి తీవ్ర గణనీయంగా తగ్గింది. 
 
అదేసమయంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణాలోని ఉత్తరాది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఉత్తరాది జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, ఆదివారం హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 17.4 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే 2.3 డిగ్రీలు అధికం. అలాగే, మెదక్‌లో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతమై ఆదిలాబాద్ జిల్లాలో 12.7 డిగ్రీలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.