1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana HC bars Chiranjeevi from construction on disputed land

చిరంజీవికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఎందుకో తెలుసా?

Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జూబ్లీహిల్స్‌ సొసైటీ నుంచి 595 చదరపు గజాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఇక్కడ నిర్మాణాలు చేసేందుకు ఆయన భూమి పూజా కూడా చేశారు. అయితే, ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిందనీ, అందువల్ల అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. వీటిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
ప్రజా ఉపయోగం కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్ బాబు, మరికొందరు కలిసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూమిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి నియంత్రణ లేకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించి సొసైటీ దానిని చిరంజీవికి విక్రయించిందని పిటిషనర్లు ఆరోపించారు. 
 
కొనుగోలు చేసిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ), జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
విశాఖ వెళ్లేందుకు ముహూర్తం ఖరారు : ఏపీ సీఎం జగన్ వెల్లడి