సంబంధిత వార్తలు
- వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఒకేసారి కోర్టుకు ఐదుగురు నిందితులు
- వైఎస్ వివేకా హత్య కేసు : సీబీఐ అధికారుల ఎదుట ఏపీ సీఎంవో ఓఎస్డీ
- కడప వైకాపా ఎంపీ అవినాశ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు
- ట్రంకు పెట్టెల్లో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలిన వివేకా హత్య కేసు ఫైళ్ళు
- వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - కడప ఎంపీ అవినాశ్‌కు తాఖీదులు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఓకే చెప్పింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్‌ను కొట్టివేసింది.
గతంలో ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది.
ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిట్ విచారిస్తుంది. అయితే, సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతుందని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణ పారదర్శకంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు కోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. సీబీఐ విచారణకు ఆదేశించవద్దంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.