1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana records highest ever rainfall in a single day as state battles floods

తెలంగాణాలో 97.7 మి.మీ వర్షపాతం.. నేడు కూడా అతి భారీ వర్షాలే...

rain
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఒక్క గురువారమే ఏకంగా 97.7 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, పాలమూరు, జనగామ, కొత్తగూడెం, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్ధిపేట, యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. 
 
గురువారం వరకు రాష్ట్రంలో సగటు వర్షంపాతం 329.3 మిల్లీమీటర్లకుగాను 530 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడైంది. అలాగే, శుక్రవారం ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మెడ్చల్, వికారాబాద్, పాలమూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 
తర్వాతి కథనం
అప్పు తీర్చలేదని భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం...