శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి

చైనాలో కరోనా ప్రళయం - ఒకే రోజు 3.7 కోట్ల పాజిటివ్ కేసులు

corona
డ్రాగన్ కంట్రీ (చైనా)లో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తుంది. ఇందుకు నిదర్శనమే ఒకే రోజు ఏకంగా 3.7 కోట్ల పాజిటివ్ కేసులు నమోదుకావడం. గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కనీవినీ ఎరుగని రీతిలో నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో డ్రాగన్ కంట్రీ పాలకలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 
 
డిసెంబరు తొలి 30 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. ఇది చైనా జనాభాలో 18 శాతం. అలాగే, ఈ వారంలో ఒకే రోజున  గత 24 గంటల్లోనే ఏకంగా 3.7 కోట్లమంది కరోనా పాజిటివ్ బాధితులుగా మారారు. చైనాలో ఇంతకుముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసులు 40 లక్షలు కాగా, ఇపుడు ఈ సంఖ్యను మించిందిపోయింది.
 
ఇపుడు ఏకంగా దాదాపుగా 4 కోట్ల కేసులు నమోదుకావడం చైనాలో కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ఇంత స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదైన దాఖలాలు లేవు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా వైరస్ తీవ్ర ఏ స్థాయిలో ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. అదేసమయంలో డ్రాగన్ పాలకులు మాత్రం కరోనా మరణాలపై మాత్రం నోరు విప్పడం లేదు.