ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (10:17 IST)

చైనా -జపాన్ దేశాల్లో కోవిడ్ విజృంభణ .. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

Corona
చైనా, జపాన్ వంటి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. ముఖ్యంగా, చైనాలో కోవిడ్ విజృంభణ తీవ్ర స్థాయిలో వుంది. ఇక్కడ వారానికి 35 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించాలని సూచించింది. రాష్ట్రాలు సేకరించే శాంపిళ్ళను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని కేంద్రం దిశానిర్దేశం చేసింది.
 
చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా వైరస్ ఉన్నట్టు విజృంభిస్తుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ఫోర్తే వేవ్‌కు కారణమైవుండొచన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా వారానికి 35 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదన్న విషయం అర్థమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. 
 
అందువల్ల రాష్ట్రాలు సేకరించే పరీక్షలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని కోరారు. ఇందులో కొత్త వేరియంట్ల ఉనికిని ప్రారంభంలోనే గుర్తించవచ్చని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.