శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (20:37 IST)

మహిళలపై జరుగుతున్న దాడుల్లో బీహార్ కంటే ఏపీలోనే అధికం : కేంద్రం

ap map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా మహిళలపై జరుగుతున్న దాడులు నమోదవుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న దాడుల అంశంపై మంగళవారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ప్రతి యేటా పెరిగిపోతున్నాయని తెలిపింది. 
 
అలాగే, గత 2018తో పోల్చితే దేశంలో అత్యాచారాలు, దాడులు పెరిగాయని వెల్లడించింది. ఏపీలో అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం పెరిగినట్టు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది.