థియేటర్లకు రప్పించే కథలు రావాలి : నందమూరి బాలకృష్ణ
balakrishna launch tarakarama
సినీ రంగంలోని దర్శక నిర్మాతలకు ఓ సూచన చేశారు. ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులు రావాలంటే భయపడుతున్నారు. అందుకు వచ్చేలా సరైన కథలు కావాలి. మంచి కథలు రావాలి. సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలంటే థియేటర్ వేదిక. దాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు అని పేర్కొన్నారు. బుధవారంనాడు హైదరాబాద్‌లోని కాచిగూడ సెంటర్‌లో గల తారకరామ థియేటర్‌ను పున:ప్రారంభించారు. మధ్యాహ్నం 12. 58 నిముషాలకు బాలకృష్ణ థియేటర్ ప్రాంభించారు.
అధునాతన హంగులతో ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఈ థియేటర్ హంగులు దిద్దారు. ఏషియన్ తారకరామగా పేరు పెట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ,1978లో నాన్నగారు ఈ తారకరామ థియేటర్‌ను ప్రారంభించారు. అమ్మ నాన్న పేరు కలిసివచ్చేలా థియేటర్ పేరు పెట్టారు. ఇది మాకు దేవాలయం. ఈ థియేటర్‌లోనే మోక్షజ్ఞ తారకరామ తేజ అని నా కొడుక్కి నాన్న ఎన్.టి.ఆర్.గారు నామకరణం చేశారని గుర్తు చేశారు.