సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (18:47 IST)

పోకిరి బాటలోనే మహేష్‌ బాబు ఒక్కడు రాబోతున్నాడు

Mahesh Babu, bhoomika
Mahesh Babu, bhoomika
మహేష్‌ బాబు నటించిన పోకిరి సినిమా ఆమధ్య రీ రిలీజ్‌ అయి సెస్సేషనల్‌ అయింది. 16 సంవత్సరాల తర్వాత రీరిలీజ్‌ పేరుతో వచ్చిన ఈ సినిమాకు అభిమానులనుంచి తెగ ఆదరణ లభించింది. ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లను మహేష్‌బాబు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా వచ్చే ఏడాది జనవరికి ఒక్కడు సినిమా కూడా రిరిలీజ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హిట్‌ చిత్రాల్లో దర్శకుడు గుణశేఖర్‌ తో చేసిన ‘‘ఒక్కడు’’ కూడా ఒకటి. తన కెరీర్‌ లో ఓ క్లాసిక్‌ హిట్‌ ఇది కాగా ఈ చిత్రంని రీ మాస్టర్‌ చేసి మళ్ళీ రిలీజ్‌ చేస్తున్నట్టుగా కూడా ఆ మధ్య మేకర్స్‌ కన్ఫర్మ్‌ చేశారు. 
 
ఈసారి మాత్రం వరల్డ్‌ వైడ్‌ ఓ స్పెషల్‌ డే కి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా సమాచారం. జనవరి 7న ఈ చిత్రం రిలీజ్‌ అయ్యిన 20 ఏళ్ల సందర్భంగా స్పెషల్‌ షోస్‌ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి మహేష్‌ ఫ్యాన్స్‌ ఏవిధంగా సెన్సేషనల్‌ క్రియేట్‌ చేస్తారో చూడాల్సిందే. ఈ చిత్రానికి మణిశర్మ  సంగీతం సమకూర్చారు. పాటలు కూడా హిట్‌ అయ్యాయి.  భూమిక నటన, ప్రకాష్‌రాజ్‌ నటన సినిమాకు ఆకర్షణగా నిలిచింది.  ఎం ఎస్‌ రాజు నిర్మాత.