శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (18:34 IST)

భారత్ నా శాశ్వత స్థానం.. చైనాకు తిరిగి వెళ్లను.. దలైలామా

dalailama
భారత్ నా శాశ్వత స్థానమని, తాను చైనాకు తిరిగి వెళ్లనని బౌద్ధమత నాయకుడు దలైలామా అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్, చైనా బలగాలు ఎప్పటికప్పుడు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో దలైలామా వ్యాఖ్యానిస్తూ.. ఇరు దేశాల అధికారులు చర్చించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. 
 
ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. చైనాకు ఫ్లెక్సిబుల్ నేచర్ ఉందని, ఇంకా తాను చైనాకు తిరిగి వచ్చే ప్రసక్తే లేదన్నారు. తాను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని, ఇది తన శాశ్వత ప్రదేశమని, తాను భారతదేశంలోనే ఉండాలనేది నెహ్రూ కోరిక అని దలైలామా పేర్కొన్నారు.