చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటలూ మృతదేహాలను..?
చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇంకా చైనాలో ఇప్పటివరకు 5,327 మంది కొవిడ్‌తో మరణించారని అధికారిక వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్ లోనే రోజుల వ్యవధిలో 2700 మంది మరణించినట్లు హాంకాంగ్ మీడియా చెప్తోంది.
ఇకపోతే.. చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తేశాక దేశంలో కరోనా వైరస్ ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్ పింగ్ సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే రోజుకు సుమారు 200 వందల మృతదేహాలను తీసుకువస్తున్నారని.. పని ఒత్తిడి పెరిగిందని.. రోజులో 24 గంటలూ మృతదేహాలను కాలుస్తున్నామని అక్కడ వైద్య సిబ్బంది చెప్తోంది.