సంబంధిత వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. ఏపీలో 1398, తెలంగాణలో 1078 కేసులు
- కర్ణాటకలో డ్రగ్స్ రాకెట్.. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. యంగ్ హీరో కూడా..?
- తెలంగాణ: ‘పుచ్చకాయ తిని చనిపోయారు’ - ప్రెస్ రివ్యూ
- నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు.. వామ్మో వడగాలులు
- తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. ఏపీలో 1288, తెలంగాణలో 956 కేసులు
మూడు రోజులు బయటకు రావొద్దు : ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంతో పాటు.. ఏపీలోని కొన్ని జిల్లాలకు చెందిన ప్రజలకు వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. ఈ మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఈనెల 5 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని విదర్భ నుంచి వడగాడ్పులు వీస్తాయని, దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వివరించింది. ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంక ర్ భూపాలపల్లి, ములుగు. భ ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని పేర్కొంది.
కాబట్టి ప్రజలు ఆరోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా చిన్నపిల్లలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కాగా శనివారం భద్రాచలంలో గరిష్ఠంగా 42.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఏపీలోను కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.
తర్వాతి కథనం